Vijayawada: అదృశ్యమైన విజయవాడ అక్కాచెల్లెళ్లలో ఒకరి ఆచూకీ లభ్యం!

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ముఖ్యనేత అనుచరులు నిత్యమూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కలిసి సమస్యను చెప్పుకునేందుకు వెళ్లి అదృశ్యమైన విజయవాడకు చెందిన అక్కాచెల్లెళ్లలో ఒకరి ఆచూకీ లభ్యమైంది. గంగిరెద్దుల దిబ్బ కొండకు చెందిన గాయత్రి, సోనియాలు 4వ తేదీన చింతమనేనిని కలిసి వస్తామని ఇంట్లో చెప్పి వెళ్లి, ఆపై మాయమయ్యారు.

ఈ విషయాన్ని వారి తల్లి మాచవరం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసును పోలీసులు సీరియస్ గా తీసుకుని వారి ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా నిన్న రాత్రి సోనియా విజయవాడకు చేరుకుంది. ఏలూరులో ఉన్న సర్టిఫికెట్లను తెచ్చుకునేందుకు తాను వెళ్లానని చెప్పింది. ఇన్ని రోజులూ తాను అమ్మమ్మ ఇంట్లో ఉన్నానని చెప్పింది. గాయత్రి 5వ తేదీనే విజయవాడకు బయలుదేరిందని పేర్కొంది. సోనియాను విచారించిన పోలీసులు, ఆమెను తల్లికి అప్పగించారు. గాయత్రి ఆచూకీ కోసం విచారిస్తున్నామని తెలిపారు.
Go Back to Shorts
Vijayawada
Missing
Soniya
Gayatri

More Telugu News