నిహారిక 'సూర్యకాంతం' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
Add ap7am to your home Screen

నిహారిక 'సూర్యకాంతం' నుంచి లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్

  • నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం'
  • దర్శకుడిగా ప్రణీత్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు
నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం' రూపొందుతోంది. ప్రణీత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

రాహుల్ విజయ్ .. మరో హీరోయిన్ పై సాగే పాట ఇది. "ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా .. పడినదాకా తెలియదే, ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా .. మనసు లోలోన నిలువదే .." అంటూ ఈ పాట కొనసాగుతోంది. మార్క్ కె.రాబిన్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
 
niharika
rahul vijay

More Telugu News