17న కేసీఆర్ బర్త్ డే వేడుకలు... భారీ ఏర్పాట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

17న కేసీఆర్ బర్త్ డే వేడుకలు... భారీ ఏర్పాట్లు!

  • జలవిహార్ లో ప్రత్యేక కార్యక్రమాలు
  • అతిథులుగా కేటీఆర్, హరీశ్, కవిత
  • ఏర్పాట్లు పరిశీలించిన తలసాని
ఈనెల 17న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కాగా, భారీ ఎత్తున వేడుకలు జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాట్లు చేస్తోంది. మాజీ మంత్రి, పార్టీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని జలవిహార్‌ లో పలు కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు.

ఈ ఉదయం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన తలసాని, కేసీఆర్ నిర్వహించిన హోమాలు, యజ్ఞాల వివరాలతో పాటు కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పుట్టిన రోజు వేడుకలకు కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని, తెలంగాణ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని అన్నారు.
KCR
Birthday
KTR
K Kavitha
Harish Rao

More Telugu News