రాజకీయాల్లోకి టీవీ ‘రాముడు’.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న అరుణ్ గోవిల్
- కాంగ్రెస్‌లో చేరికకు సర్వం సిద్ధం
- వచ్చే ఎన్నికల్లో ఇండోర్ నుంచి పోటీ
- ఇండోర్‌లో బీజేపీకి చెక్ చెప్పేందుకు కాంగ్రెస్ వ్యూహం
బీజేపీకి కంచుకోట అయిన ఇండోర్‌లో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ అక్కడి నుంచి అరుణ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ ఎంపీ, ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ అయిన సుమిత్రా మహాజన్‌కు ఇండోర్‌లో గట్టి పట్టుంది. అక్కడ ఆమెను ఢీకొట్టి గెలవడం కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. ఇప్పటికి ఎనిమిదిసార్లు అక్కడ కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న హస్తం పార్టీ అరుణ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.