KTR: అభినందనలు బావా: హరీశ్ రావుకు కేటీఆర్ ట్వీట్

షార్ట్స్‌లో చూడండి
సిద్ధిపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత మార్కెట్ చిత్రాలను మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత హరీశ్ రావు తన ట్విట్టర్ ఖాతాలో పంచుకోగా, వాటిని చూసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. "చాలా అద్భుతంగా ఉంది. నా అభినందనలు బావా" అని కామెంట్ చేశారు. కాగా, ఈ మార్కెట్లో అత్యాధునిక సౌకర్యాలు, కూరగాయలు, మాంసం ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. రైతులు, వ్యాపారులు సౌకర్యవంతంగా తమ కార్యకలాపాలు సాగించుకునేందుకు అన్ని రకాల సదుపాయాలనూ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదే తరహా మార్కెట్ సెంటర్లను మరిన్నింటిని ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇక కేటీఆర్ అభినందనల ట్వీట్ ను చూసిన హరీశ్ రావు "మెనీ థ్యాంక్స్" అని రిప్లయ్ ఇచ్చారు.



Go Back to Shorts
KTR
Harish Rao
Siddhipet
Intigreted market

More Telugu News