janasena: జనసేనలో చేరిన ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప సోదరుడు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ డిప్యూటీ సీఎం, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల లక్ష్మణమూర్తి జనసేనలో చేరారు. ప్రస్తుతానికి లక్ష్మణమూర్తి ఏ పార్టీలోనూ క్రియాశీలకంగా లేరు. జనసేనలో ఆయన చేరికపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా లక్ష్మణమూర్తి మీడియాతో మాట్లాడుతూ, తమ స్వగ్రామం పెదగాడవిల్లి అయినప్పటికీ పొరుగున ఉన్న చినగాడవిల్లి, మునిపల్లి గ్రామాల్లోని కాపు సామాజికవర్గం తమ కుటుంబానికి గత మూడున్నర దశాబ్దాలుగా అండగా ఉందని చెప్పారు. ఈ మూడు గ్రామాల్లోని కాపు యువత జనసేనలో చురుకైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. వారందరికీ అండగా ఉండటం తమ కుటుంబ బాధ్యతగా భావించి... తాను జనసేనలో చేరానని చెప్పారు.
Go Back to Shorts
janasena
nimmakayala
chinarajappa
lakshmana murthi
Telugudesam

More Telugu News