ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తిని ఆర్థిక సాయంతో బతికించిన గొప్ప వ్యక్తి ప్రకాశ్ రాజ్: నటుడు రాజా రవీంద్ర

  • ప్రకాశ్ రాజు ఇంటికి పిలిచాడు
  • ఇంతవరకూ ఆ డబ్బు తిరిగి ఇవ్వలేదు
  • ఒక ఆర్టిస్ట్ ప్రాణాలు కాపాడాడు    
ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై నటుడిగా రాణించిన రాజా రవీంద్ర, తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలా మాట్లాడుతూ ఆయన ప్రకాశ్ రాజ్ గురించి ప్రస్తావించారు. "మా పెద్దమ్మాయి పెళ్లి పనులతో నేను చాలా టెన్షన్ గా వున్నాను. అలాంటి సమయంలోనే ప్రకాశ్ రాజ్ నన్ను తన ఇంటికి పిలిచారు. నేను అడక్కుండానే డబ్బు సర్దుబాటు చేశారు. ఇంతవరకూ నేను ఇవ్వలేదు .. ఆయన అడగలేదు.

ఇక వేరే భాషకి సంబంధించిన ఒక పెద్ద ఆర్టిస్ట్ .. ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకునే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయం ప్రకాశ్ రాజ్ కి తెలిసి .. తనని వెంటబెట్టుకుని తీసుకురమ్మన్నాడు. నేను ఆ వ్యక్తిని ప్రకాశ్ రాజ్ ఇంటికి తీసుకెళ్లాను. 'ఎంత అప్పు వుంది మీకు' అని ఆ ఆర్టిస్ట్ ని ప్రకాశ్ రాజ్ అడిగాడు .. '50 లక్షలు' అని చెప్పాడాయన. 'ఇక ఆ అప్పు సంగతి మరిచిపో .. ప్రాణాలు తీసుకుందామనే ఆలోచన కూడా మరిచిపో' అని ఆ మొత్తం సాయం చేశాడు. డబ్బుకన్నా మానవతా విలువలకి అంతటి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు" అని చెప్పుకొచ్చాడు. 
Go Back to Shorts
raja ravindra
Prakash Raj

More Telugu News