hema: భయంకరమైన ఆ యాక్సిడెంట్ ను ఇప్పటికీ మరిచిపోలేను: నటి హేమ

షార్ట్స్‌లో చూడండి
ఎలాంటి పాత్రను ఇచ్చినా అలవోకగా చేయగల సామర్థ్యం హేమ సొంతం. తనదైన శైలిలో పాత్రలను పండిస్తూ ప్రేక్షకుల మెప్పును పొందడం ఆమె ప్రత్యేకత. అలాంటి హేమ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కొంతకాలం క్రితం తమకి జరిగిన ఒక ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు.

"మా ఫ్యామిలీ అంతా కారులో శ్రీశైలం వెళ్లి వస్తున్నాము .. అదే సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు కిందకి మా కారు దూరిపోయింది. ఎవరు మమ్మల్ని ఎలా బయటికి తీశారో తెలియదు. ఎవరెవరో కేకలు పెడుతున్నట్టుగా నాకు వినిపిస్తోంది గానీ .. కళ్లు మాత్రం కనబడటం లేదు.

నా ముక్కులో నుంచి రక్తం వస్తుండటంతో, మా వారు .. పాప కంగారు పడుతుండటం తెలుస్తోంది. దగ్గరలో వున్న చిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లిన కొంతసేపటికి నాకు కళ్లు కనిపించడం మొదలైంది. దాంతో వెంటనే మా బంధువులకి ఫోన్ చేశాను. వాళ్లంతా వచ్చి మమ్మల్ని పెద్ద హాస్పిటల్లో చేర్పించారు. నా ముఖానికి సంబంధించి ఇన్నర్ బోన్స్ విరిగిపోయాయని చెప్పారు. మొత్తానికి ఆ గండం నుంచి బయటపడ్డాం. ఆ సంఘటన తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తుంది" అని చెప్పుకొచ్చారు. 
Go Back to Shorts
hema

More Telugu News