అయోధ్య కేసు విచారణ ఆలస్యమవుతున్నందున.. మేము తీసుకోదగిన కనీస చర్య ఇదే: రాంమాధవ్
- వివాదరహిత భూమిని ఇవ్వాలంటూ 23 ఏళ్లుగా రామ జన్మభూమి న్యాస్ కోరుతోంది
- గత ప్రభుత్వాలు న్యాస్ డిమాండ్లను పట్టించుకోలేదు
- సుప్రీంకోర్టు అనుమతి కోసం ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు
రామ జన్మభూమి న్యాస్ డిమాండ్ ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని రాంమాధవ్ చెప్పారు. సుప్రీంకోర్టు అనుమతి తీసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. అయోధ్య కేసు విచారణ సుప్రీంకోర్టులో ఆలస్యమవుతోందని... ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోదగిన కనీస చర్య ఇదేనని చెప్పారు. వివాదంలో లేని భూమిని న్యాస్ కు అప్పగిస్తే... అది గొప్ప విషయం అవుతుందని తెలిపారు.