vijay devarakonda: విజయ్ దేవరకొండ పారితోషికం 10 కోట్లు?

షార్ట్స్‌లో చూడండి
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయనను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెండు ప్రాజెక్టులు సిద్ధంగా వున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల తరువాత విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి పెద్ద నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను .. మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనతో సినిమా చేయడానికి దిల్ రాజు ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. విజయ్ దేవరకొండను దిల్ రాజు సంప్రదించగా, ఆయన తన పారితోషికం 10 కోట్లు అని చెప్పాడనేది తాజా సమాచారం. దాంతో దిల్ రాజు ఆలోచనలో పడ్డాడని చెప్పుకుంటున్నారు. ఇది వాస్తవమే అయితే, విజయ్ దేవరకొండ ఆ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేయడం సబబేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News