జగన్ పై దాడి కేసులో ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- కోర్టులో తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- విచారణ ఇంకా కొనసాగుతోందంటూ కోర్టుకు తెలిపిన ఎన్ఐఏ
- అక్టోబర్ 25న జగన్ పై దాడి
అక్టోబర్ 25వ తేదీన విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. విమానాశ్రయంలోని ఎయిర్ పోర్టులో పనిచేసే శ్రీనివాసరావు అనే యువకుడు జగన్ పై కోడికత్తితో దాడి చేశాడు. దీన్ని ఏపీ పోలీసులు విచారిస్తున్న తరుణంలో... కేంద్ర ప్రభుత్వం కేసు విచారణను హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్ఐఏకు అప్పగించింది.