రాజమౌళి సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఛానల్!
- ‘బాహుబలి’తో అంతర్జాతీయ ఖ్యాతి
- ఆకాశాన్నంటుతున్న అంచనాలు
- రూ.132 కోట్లకు అమ్ముడైన శాటిలైట్ హక్కులు
అసలే రాజమౌళి సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి... అలాంటిది ఆయనకు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా తోడవడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడినట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఛానల్ రూ.132 కోట్లకు కొనేసిందని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.