వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎన్టీఆర్ రథయాత్రను షూట్ చేస్తున్న క్రిష్
Add ap7am to your home Screen

వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎన్టీఆర్ రథయాత్రను షూట్ చేస్తున్న క్రిష్

  • శరవేగంగా సాగుతున్న షూటింగ్
  • 22తో ముగియనున్న షెడ్యూల్
  • వచ్చే నెలలో విడుదల కానున్న 'ఎన్టీఆర్ మహానాయకుడు'
వచ్చే నెలలో విడుదల కావాల్సిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'ఎన్టీఆర్ మహానాయకుడు' షూటింగ్ ఇప్పుడు శరవేగంగా సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఎన్టీఆర్ చైతన్యరథంపై పర్యటించి, ప్రచారం చేస్తున్న దృశ్యాలను వేలాది మంది జూనియర్ ఆర్టిస్టులతో క్రిష్ చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో ప్రస్తుతం బాలకృష్ణ, కల్యాణ్ రామ్ తదితరులు పాల్గొంటుండగా, కొన్ని సీన్లలో రానా కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. బయోపిక్ తొలి భాగం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. రెండో భాగం చిత్రీకరణ 22వ తేదీతో ముగుస్తుందని, షూటింగ్ కు సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయని చిత్ర యూనిట్ పేర్కొంది.
NTR
Balakrishna
Krish
Shooting

More Telugu News