నేను ఏ పార్టీలోనూ చేరను.. రాజకీయ పార్టీ పెట్టను: ప్రకాశ్ రాజ్

  • బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలోకి
  • నా బాల్యం మొత్తం అక్కడే గడిచింది
  • బీజేపీ నీతిలేని వ్యక్తుల సమూహం
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు చెప్పిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్.. తనకు రాజకీయ పార్టీ స్థాపించే ఉద్దేశం కానీ, ఏదైనా రాజకీయ పార్టీలో చేరే ఆలోచన కానీ లేదని స్పష్టం చేశాడు. తాను స్వతంత్ర అభ్యర్థిగా మాత్రమే ఎన్నికల బరిలోకి దిగుతానని పేర్కొన్నాడు. ఒకవేళ తానేదైనా పార్టీలో చేరినా మూడు నెలల కంటే ఎక్కువ రోజులు ఉండలేనని అన్నాడు. అయితే, ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో, ఏ పార్టీని వ్యతిరేకించాలో తనకు తెలుసన్నాడు. తన బాల్యం మొత్తం బెంగళూరులోనే గడిచిందని, అందుకే అక్కడి నుంచే బరిలోకి దిగబోతున్నట్టు చెప్పాడు.

బీజేపీయేతర పార్టీలతో ఏర్పడిన మహాకూటమి గురించి తనకు అవగాహన లేదన్న ప్రకాశ్ రాజ్ బీజేపీపై విమర్శలు కురిపించాడు. అదో నీతి లేని వ్యక్తుల సమూహమన్నాడు. గోవులను పూజిస్తామంటారని, కానీ గోవులను పూజిస్తూ జరుపుకునే మకర సంక్రాంతి రోజున ఇళ్లలో పూజలు చేసుకోకుండా క్యాంపు రాజకీయాలు చేస్తారని విమర్శించాడు.
Go Back to Shorts
Prkash raj
Bengaluru
Karnataka
Elections
Actor

More Telugu News