‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్ర పరిచయం.. ఫస్ట్ లుక్ విడుదల చేసిన వర్మ!
- కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్న ఎన్టీఆర్ పాత్ర
- ఎన్టీఆర్ పాత్ర ఎవరు పోషించారో బయటపెట్టని వైనం
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ద్వారా ఎన్టీఆర్ మళ్లీ తిరిగొచ్చారన్న వర్మ
కాగా, కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ, ఆవేదనతో నిండి ఉన్న ఎన్టీఆర్ పాత్ర కనిపించింది. ఈ పాత్రను ఎవరు పోషిస్తున్న విషయం ఈ వీడియో ద్వారా వెల్లడించ లేదు. వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ద్వారా మళ్లీ తిరిగి వచ్చారని, ప్రాణం పొసుకున్నారన్న అర్థం వచ్చేలా వర్మ తన పోస్ట్ లో వ్యాఖ్యానించారు.