‘సాహో’ స్పెషల్ సాంగ్ ప్రత్యేకతలివే...!
- కవల డ్యాన్సర్లతో స్టెప్పులు
- వైభవి మర్చంట్ కొరియోగ్రఫీ
- వివిధ దేశాల డ్యాన్సుల జోడింపు
ఈ సాంగ్ కోసం లారెంట్ నికోలాస్, లారీ నికోలాస్ అనే అంతర్జాతీయ గుర్తింపు కలిగిన కవల డ్యాన్సర్లను సంప్రదించినట్టు సమాచారం. ఈ పాటకు జాతీయ అవార్డ్ గ్రహీత, బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ తో డ్యాన్స్ కంపోజింగ్ చేయించడమే కాకుండా.. ఈ పాటలో వివిధ దేశాల డ్యాన్స్‌లను సైతం జోడించనున్నట్టు సమాచారం. ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.