vijay devarakonda: హిందీ రీమేక్ దిశగా 'గీత గోవిందం'

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా .. రష్మిక మందన నాయికగా పరశురామ్ దర్శకత్వంలో 'గీత గోవిందం' సినిమా తెరకెక్కింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయవిహారం చేసింది. విజయ్ దేవరకొండ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టి, ఆయనను స్టార్ హీరోగా మార్చేసింది. అలాంటి ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది.

తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన పాత్రను ఇషాన్ కట్టర్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తో కలిసి ఇషాన్ కట్టర్ చేసిన 'ధడక్' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆయన చేసే సినిమా ఇదే కానుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇక విజయ్ దేవరకొండ చేసిన 'అర్జున్ రెడ్డి' .. ఆల్రెడీ హిందీలో 'కబీర్ సింగ్' పేరుతో రూపొందుతోన్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
vijay devarakonda
rashmika

More Telugu News