ప్రభాస్ కి నువ్వుల లడ్డూలు పంపించిన శ్రద్ధా కపూర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ కి నువ్వుల లడ్డూలు పంపించిన శ్రద్ధా కపూర్

  • శ్రద్ధా కపూర్ కి యూత్ లో క్రేజ్ 
  • 'సాహో'లో ప్రభాస్ జోడీగా 
  • ఇద్దరి మధ్య మంచి స్నేహం  
బాలీవుడ్ లో శ్రద్ధా కపూర్ కి మంచి ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె ప్రభాస్ సరసన 'సాహో' సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చాలావరకూ చిత్రీకరించారు. ఈ సినిమా కారణంగా శ్రద్ధా కపూర్ కి ప్రభాస్ తో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రభాస్ మంచి మనసు గురించి ఇంతకుముందే చెప్పిన ఆమె, సంక్రాంతి పండుగ సందర్భంగా నువ్వుల లడ్డూలను ఆయనకి పంపించిందట.

మకర సంక్రాంతి పండుగకి మహారాష్ట్రలో నువ్వుల లడ్డూలు ఒకరికొకరు ఇచ్చుకోవడం సంప్రదాయమట. ఆ సంప్రదాయం ప్రకారమే శ్రద్ధా కపూర్ .. ప్రభాస్ కి నువ్వుల లడ్డూలు పంపించిందని అంటున్నారు. 'సాహో' షూటింగ్ హైదరాబాద్ లో వుంటే, శ్రద్ధాకి ఇష్టమైన ఇక్కడి వంటకాలను ప్రభాస్ తన ఇంటి నుంచి తెప్పించేవాడట. ఆ ఆత్మీయత కూడా ఆమె లడ్డూలు పంపించడానికి కారణమై ఉంటుందని చెప్పుకుంటున్నారు. 
prabhas
shraddha

More Telugu News