టోల్ ట్యాక్స్ ను రద్దు చేసిన తెలంగాణ.. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న టోల్ నిర్వాహకులు!
- నేడు, ఈ నెల 16న ట్యాక్సులు రద్దు
- ఆదేశాలు జారీచేసిన సీఎస్ జోషి
- ఉత్తర్వులు పాటించని టోల్ సిబ్బంది
మరోవైపు ప్రభుత్వ ఆదేశాలను టోల్ నిర్వాహకులు అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా టోల్ ఫీజును వసూలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా పంతంగి, మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకులలో టోల్ ఫీజును వసూలు చేస్తుండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా టోల్ ఫీజు వసూలు చేయడం ఏంటని ప్రజలు టోల్ సిబ్బందిపై మండిపడుతున్నారు.