'బీజేపీకి రాజీనామా' వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ!
- రాజమండ్రి అర్బన్ నుంచి గెలుపొందిన నేత
- ఢిల్లీకి చేరుకున్న ఆకుల సత్యనారాయణ
- షాను త్వరలోనే కలుసుకునే ఛాన్స్
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలుసుకునేందుకు ప్రస్తుతం తాను ఢిల్లీకి వచ్చానని సత్యనారాయణ తెలిపారు. షా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారనీ, త్వరలోనే ఢిల్లీకి తిరిగివస్తారని వ్యాఖ్యానించారు. ఆయన అపాయింట్ మెంట్ తనకు ఇంకా లభించలేదన్నారు. అమిత్ షాను కలుసుకున్నాక పార్టీ మారడంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానన్నారు. ఆకుల సత్యనారాయణ త్వరలోనే జనసేనలో చేరుతారని ఇంతకుముందు వార్తలు వచ్చాయి.