vijayasanthi: పార్లమెంటు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అదే వ్యూహాన్ని అనుసరించబోతోంది: విజయశాంతి

షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక పార్టీని టార్గెట్ చేసుకోవడం, ఆ పార్టీని తిడుతూ పబ్బం గడుపుకోవడం టీఆర్ఎస్ నైజమని ఆమె మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిడుతూ ప్రచారం నిర్వహించారని అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలు చేస్తారని.... బీజేపీని టార్గెట్ చేస్తూ, మోదీ వ్యతిరేక ఓట్లను పొందాలనేది టీఆర్ఎస్ వ్యూహమని చెప్పారు.

బీజేపీని కాంగ్రెస్ పార్టీకంటే తామే ఎక్కువగా వ్యతిరేకిస్తున్నామనే భ్రమలను ప్రజల్లోకి పంపిస్తారని తెలిపారు. మరోవైపు, టీఆర్ఎస్ కు పడే ప్రతి ఓటు తమకు వేసినట్టే అనే ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే, బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని టీఆర్ఎస్ నేతలు అంటున్నా... బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. 
Go Back to Shorts
vijayasanthi
congress
TRS
bjp
Telugudesam

More Telugu News