తెలంగాణలోనే చంద్రబాబుపై ప్రజలు అంత ఆగ్రహంతో ఉన్నారంటే... ఇక ఏపీ గురించి మీరే ఊహించుకోండి!: వైఎస్ జగన్
- తెలంగాణలో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు
- టీడీపీ అభ్యర్థులు 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు
- అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకటే
- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా బీజేపీ తీవ్ర అన్యాయం చేసి, కాంగ్రెస్ పార్టీ సరసనే నిలిచిందని వ్యాఖ్యానించిన జగన్, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా దక్కదని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తాను చేస్తున్న పోరాటానికి క్లైమాక్స్ పాదయాత్రని అభివర్ణించిన జగన్, 2014 నుంచి 2017 వరకూ తమ వాణిని అసెంబ్లీ నుంచే ప్రజలకు వినిపించామని చెప్పారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారని వేచి చూశామని, స్పీకర్ అన్యాయాన్ని చూడలేకే అసెంబ్లీకి వెళ్లదలచుకోలేదని స్పష్టం చేశారు.