Tej Pratap: నెలల తరువాత... కలిసిన తేజ్ ప్రతాప్, తేజస్వి!

షార్ట్స్‌లో చూడండి
లాలూ ప్రసాద్ యాదవ్ వారసులుగా పరిచయం అక్కర్లేని తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ లు కొన్ని నెలల తరువాత కలిశారు. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, శనివారం సాయంత్రం తేజ్ ప్రతాప్ యాదవ్, కుర్తా పైజమా, మఫ్లర్ ధరించి, పాట్నాలోని దేశ్ రత్న మార్గ్ లోని తేజస్వి బంగళాకు వచ్చారు. సోదరుడుని తేజస్వి ఆహ్వానించి, ఆతని పాదాలను తాకి నమస్కరించాడు. అతని తలపై చెయ్యి వేసి ఆశీర్వదించిన తేజ్ ప్రతాప్, ఆపై అతనితో కలిసి పలు విషయాలు చర్చించారు.

 కాగా, నాలుగు రోజుల క్రితం రబ్రీదేవిని తేజ్ ప్రతాప్ కలిసిన వేళ, తేజస్వి ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం తేజ్ ప్రతాప్, తన భార్య ఐశ్వర్య నుంచి విడాకులు కోరుతూ, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సోదరుల మధ్య 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయని, వారి మధ్య రాజకీయ పరమైన మాటలే సాగాయని, తండ్రి కలలను నిజం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఎన్నికల వ్యూహంపై వారు మాట్లాడారని ఆర్జేడీ నేతలు తెలిపారు.
Go Back to Shorts
Tej Pratap
Tejaswi
Laloo
Bihar

More Telugu News