కాంగ్రెస్ కూటమిలో చేరండి: శశికళను ఆహ్వానించిన విజయశాంతి
- జైలులో శశికళను కలిసిన విజయశాంతి
- గంటకుపైగా చర్చలు
- విజయశాంతి పిలుపునకు సానుకూల స్పందన
శశికళతో గంటకుపైగా సమావేశం అయిన విజయశాంతి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ‘మహాకూటమి’తో కలిసి రావాలని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అయితే, అధిష్ఠానం ఆదేశాల మేరకే శశికళను విజయశాంతి కలిశారా? లేక, ఆమె తనకు తానుగానే వెళ్లి కలిశారా? అన్న విషయంలో స్పష్టత లేదు. విజయశాంతి అభ్యర్థనకు శశికళ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. పార్టీ నేతలతో చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని శశికళ చెప్పినట్టు సమాచారం.