ఎన్టీఆర్ కు పెద్ద వెన్నుపోటు పొడిచింది ఎవరంటే..!: సర్వే ఫలితాలు విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మ!
- లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కిస్తున్న వర్మ
- వెన్నుపోటు పాటపై టీడీపీ నేతల గుస్సా
- ట్విట్టర్ లో సర్వే చేసిన దర్శకుడు
వైస్రాయ్ గ్యాంగ్, నాదెండ్ల భాస్కర్ వెన్నుపోట్లలో ఏది పెద్ద వెన్నుపోటో చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. దీంతో పలువురు నెటిజన్లు వర్మ సర్వేపై స్పందించారు. తాజాగా ఆ ఫలితాలను వర్మ విడుదల చేశారు. వైస్రాయ్ గ్యాంగ్ వెన్నుపోటు పెద్ద వెన్నుపోటని 69 శాతం ప్రజలు తెలిపినట్లు వర్మ అన్నారు. మరో 31 మంది మాత్రం నాదెండ్ల భాస్కరరావు చేసిందే పెద్ద వెన్నుపోటని చెప్పిన్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఫలితాలను వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
.