venkatesh: వెంకటేశ్ తో వినాయక్ మూవీ?

షార్ట్స్‌లో చూడండి
మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా వినాయక్ కి మంచి పేరు వుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి ఆడియన్స్ కి కావలసిన ఎంటర్టైన్మెంట్ ను అందించడంలో అయన సిద్ధహస్తుడు. అలాంటి వినాయక్ .. 'ఇంటిలిజెంట్' సినిమా తరువాత గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లోనే మంచి కథను సిద్ధం చేసుకుని బాలకృష్ణతో సెట్స్ పైకి వెళ్లాలని భావించాడు.

ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి నిర్మాతగా సి.కల్యాణ్ ఎంతగానో ప్రయత్నించాడుగానీ కుదరలేదు. బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దాంతో ఆయన కోసం తయారు చేసిన కథను వినాయక్ .. వెంకటేశ్ కి వినిపించాడట. కథపట్ల వెంకటేశ్ సంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా చెబుతున్నారు. ఆయన ఓకే చెప్పేయడం ఖాయమని అంటున్నారు. గతంలో వినాయక్ .. వెంకటేశ్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
venkatesh
VV Vinayak

More Telugu News