నాలుగేళ్ల క్రితమే ఎంగేజ్ మెంట్ జరిగింది: దీపికా పదుకునే

  • షాకింగ్ నిజాన్ని వెల్లడించిన దీపిక
  • ఈ విషయాన్ని ఎన్నడూ బయటపెట్టలేదు
  • రానున్న పుట్టినరోజు నాకు ఎంతో స్పెషల్
బాలీవుడ్ ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్ లు ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఏకమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. నాలుగేళ్ల క్రితమే రణవీర్ తో తనకు ఎంగేజ్ మెంట్ అయిందని తెలిపింది. కానీ, ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని చెప్పింది. తమ ఎంగేజ్ మెంట్ విషయం బయటకు రాకున్నా... తమ గురించి వార్తలు వస్తూనే వచ్చాయని తెలిపింది. త్వరలోనే రానున్న తన పుట్టినరోజు తనకు ఎంతో స్పెషల్ అని... ఒకరి భార్యగా తొలి పుట్టినరోజును జరుపుకోబోతున్నానని చెప్పింది.
Go Back to Shorts
Deepika Padukone
ranveer singh
bollywood

More Telugu News