ప్రభాస్ దృష్టిలో పడిన 'కేజీఎఫ్' దర్శకుడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ దృష్టిలో పడిన 'కేజీఎఫ్' దర్శకుడు!

  • రెండు సినిమాలతో బిజీగా ప్రభాస్ 
  • 'కేజీఎఫ్' చూసిన ప్రభాస్ 
  • ప్రభాస్ కోసం కథ రెడీ చేస్తోన్న ప్రశాంత్ నీల్  
ప్రస్తుతం ప్రభాస్ .. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమాను కూడా పట్టాలెక్కించాడు. ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ తో సినిమా చేసేందుకు చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ప్రభాస్ తో సినిమా చేస్తే ఆయనకి గల క్రేజ్ కారణంగా చాలా భాషల్లో విడుదల చేసుకోవచ్చు. అందువలన ఆయనతో ఒక ప్రాజెక్టు చేయడానికి చాలా మంది ఉత్సాహాన్ని చూపుతున్నారు.

అయితే ప్రభాస్ మాత్రం ఒక దర్శకుడితో చేయడానికి ఆసక్తిని చూపుతున్నాడట .. ఆ దర్శకుడే ప్రశాంత్ నీల్. ఈయన దర్శకత్వంలో కన్నడలో రూపొందిన 'కేజీఎఫ్' ఇటీవలే థియేటర్లలోకి వచ్చింది. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా, ఇతర భాషల్లోను రిలీజ్ అయింది. ఈ సినిమా రిజల్ట్ సంగతి అటుంచితే హీరోను దర్శకుడు చూపించిన తీరు .. కథను డీల్ చేసిన విధానం ప్రభాస్ కి బాగా నచ్చాయట. అందువలన తనకు మంచి కథను సిద్ధం చేయమనీ .. కథ నచ్చితే చేసేద్దామని ప్రశాంత్ నీల్ తో అన్నాడట. అప్పటి నుంచి ఆయన అదే పనిలో ఉన్నాడని చెప్పుకుంటున్నారు. 
prabhas

More Telugu News