రాజమౌళి ఫేవరేట్ హీరోయిన్ కూడా అనుష్కానే: హీరో ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి ఫేవరేట్ హీరోయిన్ కూడా అనుష్కానే: హీరో ప్రభాస్

  • సెక్సీయెస్ట్ హీరోయిన్ అనుష్క 
  • నేను ఎంచుకునే హీరోయిన్ అనుష్క 
  • అనుష్క మంచి నటి
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి విపరీతమైన ఫాలోయింగ్ వుంది. చూడటానికి కాస్త మొరటుగా కనిపించినా ఆయన మనసు చాలా సున్నితం. ఆయన కాస్త సిగ్గరి కావడం వలన ఇంటర్వ్యూలు కూడా ఎక్కువగా ఇచ్చేవారు కాదు. అయితే ఇటీవల కాలంలో ఆయన ఇంటర్వ్యూలకు బాగానే అలవాటు పడిపోయారు. తాజాగా 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో కరణ్ జొహార్ అడిగిన ప్రశ్నలకి ఆయన తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో భాగంగా .. "టాలీవుడ్లో సెక్సీయెస్ట్ హీరోయిన్ ఎవరు?" అనే ప్రశ్నకి సమాధానంగా ప్రభాస్ .. 'అనుష్క' పేరు చెప్పారు. "కాజల్ .. తమన్నా .. అనుష్క .. ఈ ముగ్గురిలో హీరోయిన్ గా ఎంచుకోవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు?" అనే ప్రశ్నకి  ప్రభాస్ .. 'అనుష్క' పేరే చెప్పారు. అనుష్క మంచి నటి అనీ .. అందుకే ఆమె పేరు చెప్పానని అన్నారు. నాకే కాదు .. రాజమౌళి ఫేవరేట్ హీరోయిన్ కూడా అనుష్కానే" అంటూ నవ్వేశారు. 
Prabhas
anushka

More Telugu News