ప్రభాస్ తో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది: కంగనా రనౌత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ తో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది: కంగనా రనౌత్

  • ప్రభాస్ .. నేను ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం 
  • ఆయన ఎదుగుదల చూస్తుంటే గర్వంగా వుంది 
  • మహేశ్ తోను కలిసి నటించాలనుంది
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కంగనా రనౌత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. త్వరలో 'మణికర్ణిక' చిత్రం ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రభాస్ పేరును ప్రస్తావించడం విశేషం. "నేను .. ప్రభాస్ కలిసి గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఏక్ నిరంజన్' సినిమా చేశాము. అప్పటికి ప్రభాస్ పెద్ద స్టార్ కాదు.

ఆ సినిమా షూటింగు సమయంలో మేమిద్దరం ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాళ్లం .. ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్లం. ప్రభాస్ మంచి మనసున్న వ్యక్తి. 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకప్పటి ప్రభాస్ ను .. ఇప్పటి ప్రభాస్ ను చూస్తుంటే ఆయన ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన ఎదుగుదల చూస్తుంటే ఎంతో గర్వంగా వుంది. ప్రభాస్ తో మళ్లీ ఒక సినిమా చేయాలనుంది .. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను. ఇక ప్రభాస్ తరువాత నేను కలిసి నటించాలనుకునే మరో హీరో మహేశ్ బాబు" అని ఆమె చెప్పుకొచ్చింది.
prabhas
kangana

More Telugu News