నా దృష్టిలో టాలీవుడ్ హీరోలలో ఉత్తమ నటుడు ఎన్టీఆరే!: ప్రభాస్
Add ap7am to your home Screen

నా దృష్టిలో టాలీవుడ్ హీరోలలో ఉత్తమ నటుడు ఎన్టీఆరే!: ప్రభాస్

  • మొదటి స్థానం ఎన్టీఆర్ దే 
  • తరువాత స్థానాల్లో మహేశ్ .. బన్నీ .. చరణ్ 
  • ఉత్తమనటి అలియా భట్   
తెలుగులో ప్రభాస్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. 'బాహుబలి'తో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానుల సంఖ్య పెరిగింది. టాలీవుడ్లోని ఇతర కథానాయకులతో ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు వున్నాయి. అలాంటి ప్రభాస్ ను ఇరకాటంలో పెట్టేలా 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో కరణ్ జొహార్ ఒక ప్రశ్న అడిగారు.

"టాలీవుడ్ లోని మిగతా హీరోల్లో ఉత్తమ నటుడిగా వీరిలో ఎవరిని భావిస్తావు?" అంటూ ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ .. బన్నీ పేర్లను కరణ్ వరుసగా చెప్పారు. సాధారణంగా ఈ ప్రశ్నకి ఇంకెవరైనా అయితే 'అందరూ మంచి నటులే' అనే సమాధానమిస్తారు. కానీ ప్రభాస్ ఎంతమాత్రం తడుముకోకుండా ఎన్టీఆర్ కి మొదటి స్థానం ఇస్తానని చెప్పాడు. ఆ తరువాత స్థానాల్లో మహేశ్ బాబు .. బన్నీ .. చరణ్ ఉంటారని అన్నాడు. 'ఇక బాలీవుడ్లో అలియా భట్ .. దీపికాలలో ఉత్తమ నటిగా ఎవరి పేరును చెబుతారు?' అనే కరణ్ ప్రశ్నకి సమాధానంగా ప్రభాస్ 'అలియాభట్' పేరు చెప్పాడు. 
prabhas
ntr

More Telugu News