క్రిస్మస్ కి గట్టిపోటీ .. మరో హిట్ కొట్టేసిన విజయ్ సేతుపతి!
- '96' మూవీ బ్లాక్ బస్టర్ హిట్
- రీసెంట్ గా వచ్చిన 'సీతా కత్తి'
- 70 యేళ్ల వృద్ధుడిగా సేతుపతి
దాదాపు 8 సినిమాలతో పోటీపడుతూ ఈ సినిమా అక్కడ విడుదలైంది. ఈ పోటీలో ధనుశ్ 'మారి 2' కూడా వుంది. ఈ సినిమాలన్నింటిలో 'సీతాకత్తి' మంచి మార్కులు కొట్టేసింది. 'భారతీయుడు' సినిమాలో సీనియర్ కమలహాసన్ లుక్ కి దగ్గరగా ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడు. కథాబలం .. విజయ్ సేతుపతి నటన బలంతోనే ఈ సినిమాకి మార్కులు పడిపోతున్నాయని తెలుస్తోంది. 70 యేళ్లు పైబడిన వృద్ధుడి పాత్రలో సేతుపతి అదరగొట్టేశాడని అంటున్నారు. నిస్సందేహంగా ఈ క్రిస్మస్ విజేత విజయ్ సేతుపతినే అని చెబుతున్నారు.