బాలయ్య కోసం ఇంకా కథ రెడీ చేయని బోయపాటి
Add ap7am to your home Screen

బాలయ్య కోసం ఇంకా కథ రెడీ చేయని బోయపాటి

  • చరణ్ మూవీతో బిజీగా బోయపాటి 
  • వినాయక్ తో సెట్స్ పైకి బాలకృష్ణ 
  • నిర్మాతగా సి.కల్యాణ్
ప్రస్తుతం బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన 'మహానాయకుడు' విడుదలతో బాలకృష్ణ ఫ్రీ అవుతారు. ఆ తరువాత బాలకృష్ణ .. వినాయక్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ .. బోయపాటితోనే సినిమా చేయవలసి వుంది. కొత్తగా ఉండేలా తన మార్క్ కథను సిద్ధం చేయమని కొంతకాలం క్రితమే బాలకృష్ణ చెప్పారట. అయితే 'వినయ విధేయ రామ' పనులతో బోయపాటి బిజీగా వున్నాడు. ఇది భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఆయన పూర్తి సమయాన్ని ఈ ప్రాజెక్టుకే కేటాయించాడట. అందువల్లనే కథను సిద్ధం చేయలేకపోవడం జరిగిందని ఆయన బాలకృష్ణకి చెప్పినట్టుగా సమాచారం. దాంతో వినాయక్ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని బాలకృష్ణ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. బాలకృష్ణను వినాయక్ ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి మరి. 
balakrishna
vinayak

More Telugu News