ఈ ఏడాది ఆర్థికంగా పెద్ద దెబ్బే తగిలింది: హీరో విజయ్ సేతుపతి
- విలక్షణ నటుడిగా మంచి క్రేజ్
- '96' మూవీతో భారీ హిట్
- 'జుంగా' సినిమాతో భారీ నష్టం
అయితే, విజయ్ సేతుపతి మాత్రం ఈ ఏడాది ఆర్థికంగా తనకి పెద్ద దెబ్బే తగిలిందని సన్నిహితులతో చెబుతున్నాడట. ఈ ఏడాది జూలైలో వచ్చిన 'జుంగా' సినిమాకి విజయ్ సేతుపతి కూడా ఒక నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా కోసం ఆయన 11 కోట్లు ఖర్చు చేశాడు. దాదాపు విదేశాల్లోనే షూటింగ్ జరుపుకున్న 'జుంగా' పరాజయం పాలైంది. దాంతో విజయ్ సేతుపతికి 11 కోట్ల నష్టం వచ్చింది. ఆ తరువాత ఆయన చేసిన మూడు సినిమాల పారితోషికంతో ఆ అప్పులు తీర్చినట్టుగా తెలుస్తోంది.