ఐఎన్ఎక్స్ మీడియా కేసు.. ఈడీ ఎదుట హాజరైన చిదంబరం
- ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నోటీసులు
- కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు
- 15 వరకు అరెస్ట్ చేయొద్దన్న ఢిల్లీ హైకోర్టు
అయితే వీటిల్లో అక్రమాలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలో మంత్రి అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసును ఈడీ, సీబీఐ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఈ కేసులో చిదంబరానికి ముందస్తుగానే కోర్టులో ఉపశమనం లభించింది. జనవరి 15 వరకు ఆయనను అరెస్ట్ చేయరాదంటూ ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.