venkatesh: 'రెచ్చిపోదాం బ్రదర్' అంటోన్న వెంకటేశ్

షార్ట్స్‌లో చూడండి
అనిల్ రావిపూడి బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలను నమోదు చేస్తూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 2' సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా, తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా సందడి చేయనున్నారు. 'రెచ్చిపోదాం బ్రదర్' అంటూ ఈ రోజున సాయంత్రం 5 గంటలకు ఒక వీడియో క్లిప్ ను రిలీజ్ చేయనున్నారు.

రేపు సాయంత్రం 5 గంటలకు ఫుల్ వీడియో లిరికల్ సాంగ్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఒకే రకమైన సూటు .. బూటుతో ఈ పోస్టర్లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కనిపిస్తున్నారు. ఎక్కడా యాక్షన్ కి చోటులేకుండా .. పూర్తి వినోదభరితంగా అనిల్ రావిపూడి ఈ కథ రాసుకున్నాడు. అంతే ఫన్ తో ఈ సినిమాను రూపొందించాడు. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించే కంటెంట్ ఉండటంతో, ఈ సినిమా సంక్రాంతి బరిలో సక్సెస్ ను సాధిస్తుందనే నమ్మకంతో దర్శక నిర్మాతలు వున్నారు. 
Go Back to Shorts
venkatesh
varun
tamannah
mehreen

More Telugu News