cool winds: తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత.. నలుగురి మృతి!

షార్ట్స్‌లో చూడండి
అసలే శీతాకాలం, ఆపైన పెథాయ్‌ తుపాన్‌ గాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. రెండు రాష్ట్రాల్లో పలు ప్రాంతాలను చలి వణికిస్తోంది. ఇప్పటికే ఆంధ్ర, తెంగాణ రాష్ట్రాల్లో చలిగాలుల ప్రభావం కారణంగా నలుగురు మృత్యువాత పడ్డారు.

విశాఖ, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఒకరు చనిపోయారు. విశాఖ జిల్లా హుకుంపేట మండలం దాలిగుమ్మడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనవానిలంకలో వృద్ధురాలు, ప్రకాశం జిల్లా వేటపాలెం బస్ షెల్టర్‌లో ఓ వృద్ధుడు మృతి చెందారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కొమ్ముగూడెంలో కాశీ (55)  అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు.
Go Back to Shorts
cool winds
four died

More Telugu News