ఆసక్తిని రేకెత్తిస్తోన్న మోహన్ లాల్ టీజర్
- మోహన్ లాల్ కథానాయకుడిగా 'లుసీఫెర్'
- దర్శకుడిగా పృథ్వీ రాజ్ సుకుమార్
- మార్చి 28వ తేదీన విడుదల
ఆంటోని నిర్మిస్తోన్న ఈ సినిమాకి పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మోహన్ లాల్ సరసన మంజు వారియర్ నటిస్తుండగా, కీలకమైన పాత్రలో వివేక్ ఒబెరాయ్ కనిపించనున్నాడు. దీపక్ దేవ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. జైలు వాతావరణంతో కూడిన దృశ్యాలతో ఈ టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులోను ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా వున్నాయి.