చరణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి .. ఎన్టీఆర్
Add ap7am to your home Screen

చరణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి .. ఎన్టీఆర్

  • బోయపాటి నుంచి 'వినయ విధేయ రామ'
  • ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు 
  • జనవరి 11వ తేదీన విడుదల
చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేసింది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వైజాగ్ లో ఈ వేడుక ఏర్పాట్లు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

వైభవంగా జరిగే ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ .. రాజమౌళి రానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. చరణ్ .. ఎన్టీఆర్ .. రాజమౌళి కాంబినేషన్లో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. చరణ్ తో వున్న సాన్నిహిత్యం కారణంగానే ఈ వేడుకకి ఎన్టీఆర్ .. రాజమౌళి రానున్నట్టు తెలుస్తోంది. ఇలా ఒకే వేదికపై చరణ్ .. ఎన్టీఆర్ .. రాజమౌళి కనిపించడం వలన ఇటు 'వినయ విధేయ రామ'కే కాకుండా అటు 'ఆర్ ఆర్ ఆర్'కి కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.      
ntr
charn
rajamouli

More Telugu News