ఎంపీ మురళీమోహన్‌ది మంచి ఆలోచన... ఆందరూ ఫాలో కావాలి: సీఎం చంద్రబాబు
- మొబైల్ క్యాన్సర్ వాహనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
- తన ఎంపీ నిధులతో దీన్ని రూపొందించిన మురళీమోహన్
- చంద్రన్న సంచార చికిత్సతో గ్రామాల్లో సేవలకు వినియోగం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ అంబులెన్స్ ద్వారా పల్లెల్లోని రోగులకు పూర్తి స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మురళీమోహన్ మాట్లాడుతూ ఈ సంచార వాహనాన్ని మండల కేంద్రంలో అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. అవసరమైన రోగులు వస్తే వాహనంలోనే వైద్యులు చికిత్స అందించి సూచనలు చేస్తారని తెలిపారు. ప్రతీ నియోజకవర్గంలో ఇటువంటి వాహనాన్ని ఏర్పాటుచేసి క్యాన్సర్ నివారణకు కృషి చేయాలన్నదే తన ఉద్దేశమని చెప్పారు.