మహేశ్ బాబు జోడీగా మరోసారి ఛాన్స్ కొట్టేసిన రకుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు జోడీగా మరోసారి ఛాన్స్ కొట్టేసిన రకుల్

  • షూటింగు దశలో 'మహర్షి'
  • సుకుమార్ తో మహేశ్ నెక్స్ట్ మూవీ 
  • మైండ్ గేమ్ తరహాలో సాగే కథ
మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి కాంబినేషన్లో 'మహర్షి' సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తదుపరి సినిమాకి సంబంధించిన పనులు వేగవంతం అయ్యేలా మహేశ్ బాబు చూసుకుంటున్నాడు. ఆయన తదుపరి సినిమా సుకుమార్ తో వుంది. ముందుగా చారిత్రక నేపథ్యంతో కూడిన కథ వినిపిస్తే 'నో' చెప్పేసిన మహేశ్ బాబు, రీసెంట్ గా సుకుమార్ వినిపించిన మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు.

ఇది కూడా మైండ్ గేమ్ తరహాలోనే సాగే కథ అని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సుకుమార్ చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఆమెనే హీరోయిన్. ఆ సెంటిమెంట్ తోనే ఆయన రకుల్ ను తీసుకున్నాడట. ఇక మహేశ్ బాబు వైపు నుంచి చూస్తే ఇంతకుముందు ఆయన చేసిన 'స్పైడర్'లో కూడా ఆమెనే హీరోయిన్. అయినా సుకుమార్ కథపై నమ్మకంతో మహేశ్ బాబు ఓకే అనేశాడనే టాక్ వినిపిస్తోంది.  
Mahesh Babu
rakul

More Telugu News