vijay devarakonda: విజయ్ దేవరకొండ కోసం ముగ్గురు దర్శకుల వెయిటింగ్

షార్ట్స్‌లో చూడండి
'టాక్సీవాలా' సక్సెస్ తో విజయ్ దేవరకొండ మాంఛి జోరుమీదున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'డియర్ కామ్రేడ్' రూపొందుతోంది. ఈ సినిమా తరువాత చేయడానికి ఆల్రెడీ రెండు ప్రాజెక్టులు విజయ్ దేవరకొండ చేతిలో వున్నాయి. మరో నాలుగు ప్రాజెక్టులకు సంబంధించిన అడ్వాన్సులు కూడా ఆయన దగ్గర వున్నాయి. ఇప్పట్లో ఆయన డేట్లు ఖాళీలేవు. అయినా ఆయన కమిట్ మెంట్స్ పూర్తయిన తరువాతనే చేద్దామనే ఉద్దేశంతో ముగ్గురు దర్శకులు వున్నట్టుగా తెలుస్తోంది. ఆ ముగ్గురు దర్శకులే పూరి జగన్నాథ్ .. మారుతి .. గోపీచంద్ మలినేని.

ఇప్పటికే విజయ్ దేవరకొండకి పూరి ఒక కథను వినిపించాడట. ఇక మారుతి రెండు మూడు కథలు సిద్ధం చేసుకుని .. విజయ్ దేవరకొండకి ఏది నచ్చితే అది లాక్ చేయాలనే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. గోపీచంద్ మలినేని కూడా ఒక కథపై కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఆ కథను త్వరలోనే విజయ్ దేవరకొండకి వినిపించనున్నాడని అంటున్నారు. మొత్తానికి విజయ్ దేవరకొండ విషయంలో దర్శకుల మధ్య గట్టిపోటీనే వుందన్న మాట.   
Go Back to Shorts
vijay devarakonda

More Telugu News