కన్నడ నటుడు దునియా విజయ్‌ను వెంటాడుతున్న కష్టాలు.. మహిళా కమిషన్‌ను ఆశ్రయించిన మొదటి భార్య
- తాను బతికి ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడన్న నాగరత్న
- భరణం, నివాసం ఇప్పించాలని ఫిర్యాదు
- ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం
మారుతిపై దాడి కేసులో దునియా విజయ్ జైలుకెళ్లిన తర్వాత అతడి మొదటి భార్య నాగరత్న-రెండో భార్య కీర్తిగౌడల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో నాగరత్న కుమార్తెపై కీర్తి గౌడ అనుచరులు దాడి చేయడంలో అప్పట్లో సంచలనమైంది. తాజాగా, నాగరత్న ఫిర్యాదుతో మరోమారు విజయ్ అంశం తెరపైకి వచ్చింది. నాగరత్న చేసిన ఆరోపణలు నిజమైతే విజయ్‌కు ఏడేళ్ల జైలు శిక్షపడే అవకాశం ఉంది.