ఖాజీపేటలో కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా పట్టుబడ్డ డబ్బు!
- కాంగ్రెస్ నేత అమృతరావు వద్ద పట్టుబడ్డ రూ.3 కోట్లు
- తన ఇంటి పక్క ఇంట్లో డబ్బును దాచిన వైనం
- పోలీసుల అదుపులో అమృతరావు, ఇంటి యజమాని
వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ సొమ్మును ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్టు పోలీసులు చెప్పారు. అమృతరావు తన ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిని అద్దె తీసుకుని, ఆ ఇంట్లో ఈ డబ్బును దాచి పెట్టి, కార్యకర్తల ద్వారా ఓటర్లకు పంచేందుకు ప్లాన్ వేశారు. ఈ మేరకు పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడికి వెళ్లారు. అమృతరావుతో పాటు ఇంటి యజమానిని అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు.