ప్రజా కూటమి తెలంగాణ ప్రజల గొంతుక వినిపిస్తోంది: సోనియా గాంధీ
Add ap7am to your home Screen

ప్రజా కూటమి తెలంగాణ ప్రజల గొంతుక వినిపిస్తోంది: సోనియా గాంధీ

  • ప్రజా కూటమి తెలంగాణ ప్రజల కూటమి
  • తెలంగాణ ఏర్పాటులో నా పాత్ర ఉంది
  • మా కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
తెలంగాణ ఓటర్లకు యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఓ వీడియో సందేశం పంపారు. ప్రజా కూటమి తెలంగాణ ప్రజల కూటమి అని, ప్రజల గొంతుక వినిపిస్తోందని అన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం తెలంగాణ ఏర్పాటులో తన పాత్ర ఉందని, అధికారంలో ఉన్నవాళ్లు తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు వేసే ప్రతి ఓటు మీ భవిష్యత్ ను నిర్దేశిస్తుందని సూచించారు. ప్రజాకూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ప్రజలు ఎన్నుకునేది తమ ఎమ్మెల్యేలను మాత్రమే కాదని, వారి భవిష్యత్ ను కూడా అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆ వీడియో సందేశంలో ప్రజలకు సోనియా సూచించారు.
prajakutami
Telangana
congress
Sonia Gandhi

More Telugu News