'మహావీర్ కర్ణ'గా విక్రమ్ .. 300 కోట్లకి పైగా బడ్జెట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మహావీర్ కర్ణ'గా విక్రమ్ .. 300 కోట్లకి పైగా బడ్జెట్

  • తమిళంలో మరో భారీ బడ్జెట్ మూవీ 
  • కర్ణుడి జీవితచరిత్రగా సాగే కథ 
  • 10 భాషల్లో విడుదల చేసే ఆలోచన   
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో చారిత్రక చిత్రాలను తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. వివిధ భాషల్లో ఒకే రోజున అత్యధిక థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉండటంతో, వందల కోట్లను ఖర్చు చేయడానికి ఎంతమాత్రం వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలోనే విక్రమ్ ప్రధాన పాత్రధారిగా 'మహావీర్ కర్ణ' అనే తమిళ సినిమా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి.

ఆ తరువాత ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ లేకపోవడంతో, ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే అంతా అనుకున్నారు. కానీ ఈ రోజున ఈ సినిమా తిరువనంతపురం .. అనంతపద్మనాభ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. దర్శక నిర్మాతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారుగానీ .. కొన్ని కారణాల వలన విక్రమ్ మాత్రం రాలేదు. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మించే ఈ సినిమాకి ఆర్.ఎస్. విమల్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 10 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయనున్నారు.        
vikram

More Telugu News