ఈడీ ఎదుట హాజరైన సుజనా చౌదరి
- బ్యాంకులను మోసం చేశారన్న ఆరోపణలు
- నివాసం, కంపెనీల్లో ఈడీ సోదాలు
- 5 గంటల పాటు ప్రశ్నించిన ఈడీ
ఈడీ సమన్లను రద్దు చేయాలంటూ సుజనా చౌదరి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆయన నేడు ఈడీ ఎదుట హాజరయ్యారు. చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారణ చేపట్టిన అధికారులు ఆయన్ను పలు అంశాలపై దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు.