నేను ‘కాంగ్రెస్’లో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.. నమ్మకండి: టీఆర్ఎస్ ఎంపీ నగేశ్
Add ap7am to your home Screen

నేను ‘కాంగ్రెస్’లో చేరుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.. నమ్మకండి: టీఆర్ఎస్ ఎంపీ నగేశ్

  • నాపై దుష్ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తా
  • టీఆర్ఎస్ ఎంపీగా మళ్లీ నేనే పోటీ చేస్తా
  •  ప్రజాకూటమిని ఎవరూ నమ్మడం లేదు
తాను ‘కాంగ్రెస్’లో చేరుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని,  ఈ ప్రచారాన్ని నమ్మొద్దని ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీ గోడం నగేశ్ కోరారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తనపై ఈవిధంగా దుష్ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎంపీగా బి-ఫామ్ తన జేబులోనే ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ప్రజాకూటమిపై ఆయన విమర్శలు గుప్పించారు. కూటమిని ఎవరూ నమ్మడం లేదని అన్నారు.
TRS
mp nagesh
adilabad
t-congress

More Telugu News