దీపిక, రణ్ వీర్ రిసెప్షన్... చెత్త డ్రస్సంటూ నెటిజన్ల కామెంట్లు!
- ముంబైలో మూడో రిసెప్షన్
- ఎరుపు రంగు దుస్తుల్లో దీపిక
- డ్రస్ బాగాలేదంటున్న నెటిజన్లు
కాగా, ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ దంపతులతో పాటు అనుష్కా శర్మ, ఐశ్వర్యా రాయ్, హృతిక్, షారూక్, సోనాక్షీ, సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్, కరీనా కపూర్, శిల్పా శెట్టి, కరణ్ జోహార్ తదితరులు ఎంతో మంది హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. సచిన్ టెండూల్కర్ సైతం తన భార్య అంజలి, కుమారుడు అర్జున్ లతో రిసెప్షన్ కు రాగా, మహేష్ భూపతి, బోనీ కపూర్ తన కుమార్తెలు జాన్వీ, ఖుషీలతో హాజరయ్యారు.