మొదలైన 'ఏఎంబీ' సినిమాస్... మహేష్ బాబు సొంత థియేటర్లు సూపరంటున్న ప్రేక్షకులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొదలైన 'ఏఎంబీ' సినిమాస్... మహేష్ బాబు సొంత థియేటర్లు సూపరంటున్న ప్రేక్షకులు!

  • తెలుగు రాష్ట్రాల్లో అత్యంత లగ్జరీ థియేటర్
  • పడుకుని సినిమా చూసేందుకూ ఏర్పాట్లు
  • హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రారంభమైన ఏఎంబీ
హైదరాబాద్, గచ్చిబౌలీలో మహేష్ బాబు నిర్మించిన ఏఎంబీ సినిమాస్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మొత్తం 7 స్క్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ఉన్న థియేటర్లో '2.ఓ' చిత్రం నేడు తొలి సినిమాగా ప్రదర్శితమైంది. రూ. 230 నుంచి టికెట్ ధర ప్రారంభం కాగా, వచ్చే నాలుగైదు రోజుల వరకూ దాదాపు అన్ని ఆటలూ హౌస్ ఫుల్ అయ్యాయి. 'బుక్ మై షో' ద్వారా టికెట్ల అమ్మకాలు సాగుతుండగా, ప్రతి ఆటకూ అతి తక్కువ సీట్లు మాత్రమే ఖాళీగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ థియేటర్లను చూసిన వారు, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత లగ్జరీగా ఉన్నది ఇదేనంటూ కితాబిస్తున్నారు. రీక్లయినర్ సీట్లతో పాటు, పడుకుని చిత్రాన్ని వీక్షించేందుకు కూడా ఏర్పాట్లు చేయడం గమనార్హం. థియేటర్ నిర్మాణాన్ని మహేష్ సతీమణి నమ్రత దగ్గరుండా పర్యవేక్షించారు.
Mahesh Babu
AMB
2.0
Luxury
Theaters
Movie

More Telugu News